పిటీఎం: కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం

79చూసినవారు
పిటీఎం: కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం
పెద్దతిప్ప సముద్రం మండలంలో శనివారం మండల విద్యాశాఖ అధికారి నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ శివ కుమార్ రెడ్డి లు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులతో మాట్లాడుతూ ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈఓ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, స్వచ్ఛమైన భోజనం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్