పీటీఎం మండలం అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, చందు మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు ఎస్సై హరిహర ప్రసాద్ తెలిపారు. మార్చి నెల 18న గుర్తుతెలియని లారీ ఢీకొని పీటీఎం అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, చందు మృతి చెందారు. లారీ డ్రైవర్ పారిపోవడంతో కేసు నమోదు చేశారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టి జార్ఖండు చెందిన దావరిక యాదవ్ గా గుర్తించి శనివారం అరెస్టుచేసి కోర్టుకు తరలించారు.