పీటీఎం శివాలయంలో ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆలయంలో చైత్ర పున్నమి సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతం వేద పండితులు మురళిస్వామిలచే సత్యనారాయణ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించచారు. స్వామికి ప్రత్యేక అలంకరణతో సప్తహారతి, పంచహారతి, నక్షత్రహారతి, మహామంగళహారతి అనంతరం ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు.