తిరుపతిలో 23వ తేదీన జరగనున్న మాలలమాల సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు అధ్యక్షుడు కృష్ణప్ప కోరారు. గురువారం రామసముద్రం టీటీడీ కల్యాణ మండపంలో మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న మాలలు మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు శివశంకర్, సమత సైనిక్ దళ్ అధ్యక్షుడు జయరాజ్ పాల్గొన్నారు