వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించకుండా, రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాల నడపాలని రామసముద్రం ఎస్‌ఐ రమేష్ బాబు అన్నారు. శనివారం రామసముద్రం మండల కేంద్రంలో రహదారి భద్రత నియమాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహనాన్ని రహదారి భద్రతా నియమాలు పాటించి నడపాలని, ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.