రామసముద్రం మండలంలో ఎర్రబోయనపల్లి, శ్రీరాములపల్లి గ్రామస్తుల మధ్య జరిగిన దాడిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీఐ సత్యనారాయణ తెలిపారు. దాడిలో గాయపడ్డవారు మదనపల్లి, పుంగనూరు, కోలార్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ఎర్రబోయనపల్లి గ్రామస్తులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. కేసులు నిక్షపక్షంగా విచారణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఘటనపై పోలీసులతో సమీక్ష నిర్వహించారు.