రామసముద్రం: అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభించింది

56చూసినవారు
రామసముద్రం: అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభించింది
రామసముద్రం మండలం మూగవాడి పల్లెకు చెందిన శంకర్ రెడ్డి ఈనెల 10వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ బ్యాంకులో అధికారుల వేధింపుల వల్లే ఇల్లు వదిలి వెళ్లాడని కుటుంబీకులు తెలిపారు. అదే రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల తర్వాత శంకర్ ను తిరుమలలో చూసిన ఓ వ్యక్తి సోమవారం కుటుంబీకులకు సమాచారం అందించారు. మంగళవారం అదృశ్యమైన శంకర్ దొరకడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్