తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లిలో దళితుల రహదారి సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎంపీపీఎస్ నాయకుడు వేటామల్లికార్జున నిలదీశారు. బుధవారం అంబేద్కర్ కాలనీలో జరిగిన పౌరహక్కుల దినోత్సవ గ్రామసభ రసాబాసాగా మారింది. ఎంపీడీఓ కృష్ణమూర్తి గుండ్లపల్లి రహదారి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పడంతో ఎంఆర్పీఎస్ నాయకులు శాంతించారు. ఏఈ లు అశోక్, హరినాథ్, ఎంఈఓ త్యాగరాజు, రాధమ్మ పాల్గొన్నారు.