దండువారి పల్లె దారి సమస్యను పరిష్కరించండి

77చూసినవారు
దండువారి పల్లె దారి సమస్యను పరిష్కరించండి
తంబళ్లపల్లె మండలం దండువారి పల్లె దారి సమస్యను పరిష్కరించాలని సిపిఐ (ఎం ఎల్)‌ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దండువారి పల్లెలో ఉన్న క్రిష్ణమ్మ ఆమె కుమారుడు రమేష్ రెడ్డి కలసి దారిని ఆక్రమించారని గతంలో ప్రజలు తహశీల్దార్ కు వినతి పత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్