తంబళ్లపల్లె: బిగ్గరగా మైక్ పెట్టొద్దన్నందుకు దాడి

64చూసినవారు
ప్రతి సోమవారం వారపు సంత తంబళ్లపల్లెలో ఘనంగా జరుగుతుంది. ఈ క్రమంలో బయటి నుంచి ఓ ఆటోలో వచ్చిన వ్యాపారి హరిత కూడలి వద్ద రోడ్డుపై బిగ్గరగా మైక్ పెట్టుకుని కూరగాయలు విక్రయించసాగాడు. దీంతో అక్కడే ఉన్న వ్యాపారులు మైక్ పెట్టకుండా వ్యాపారం చేసుకోవాలని తెలిపారు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులంతా కలసి బయటి నుంచి వచ్చిన వ్యాపారికి దేహశుద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్