తంబళ్లపల్లె సమీపంలోని ఎర్రగుంట్ల గంగమ్మ జాతర ఈ నెల 12,13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. డప్పుతో జాతరకు సోమవారం చాటింపు వేశారు. 12న ఉదయం నుంచి అమ్మరికి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి దీలు బోనాలు సమర్పిస్తారన్నారు. అన్నదానం ఆలయం వద్ద ఉంటుందన్నారు. 12న రాత్రికి చాందినీ బండ్ల మెరవని నిర్వహించనున్నట్లు వివరించారు. 13న జాతర ముగింపు ఉంటుందని తెలిపారు.