తంబళ్లపల్లె: పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే వైద్య శిబిరాలు

59చూసినవారు
తంబళ్లపల్లె: పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే వైద్య శిబిరాలు
పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసమే పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు వైద్యశాఖ సహాయ సంచాలకులు సుమిత్ర అన్నారు. శుక్రవారం ఎద్దుల వారి పల్లిలో పశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి పశువులకు, దూడలకు నట్టల నివారణ మందులు పిచికారీ చేశారు. పశువులకు చూలు పరీక్షలు నిర్వహించారు. గొర్రెలకు డి వార్మింగ్ మందులు పంపిణీ చేశారు. పశువులకు సంక్రమించే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్