తంబళ్లపల్లె కు నూతనంగా వచ్చిన ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డిని శనివారం తంబళ్లపల్లె మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ ల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు తంబళ్లపల్లెలో ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్, శాంతి భద్రతల పై చర్యలు తీసుకోవాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మండలంలో శాంతిభద్రతలతో పాటు అసాంఘిక చర్యల పై కఠినంగా వ్యవహరిస్తామని ఇందుకు మీ పూర్తి సహకారం అందించాలని కోరారు.