తంబళ్లపల్లె పరిధిలోని పెంపుడు కుక్కలకు రాబీస్ వ్యాధి టీకాలు వేయించడం ఉత్తమమని మండల పశువైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాల నందు ప్రపంచ జంతు సంక్రమిత వ్యాధుల (జూనోసిస్) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 35 పెంపుడు కుక్కలకు ఉచితంగా రాబీస్ వ్యాధి టీకాలు వేయడం జరిగింది. డాక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రాబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు.