తంబళ్ళపల్లి లోని సిద్దారెడ్డి గారి పల్లిలో పది రోజులుగా పంచాయతీ వారు నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ పూర్తయింది. గురువారం ఉదయం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ పైప్ లైన్ ద్వారా త్రాగునీరు విడుదల చేశారు. మసీదు వీధిలోని ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేశారు. పాత పైప్ లైన్ దెబ్బతినడంతో ఎంపీడీవో ఉపేంద్ర ఆదేశాలతో పంచాయతీ నిధులతో పైప్ లైన్ వేసినట్లు కార్యదర్శి తెలిపారు.