యువత పోరు వైసీపీ ఆడే నాటకమని తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి బాధ్యులు జయచంద్ర రెడ్డి అన్నారు. మంగళవారం కూటమి నాయకులతో కలిసి టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర యువత భవిష్యత్తును దెబ్బతీసింది వైసిపి ప్రభుత్వం అని అన్నారు. 2. 3 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ పై మాట తప్పి వైసిపి యువతను మోసం చేసింది అన్నారు. యువతకు ఉద్యోగాల కోసం రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామన్నారు.