తంబళ్లపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతో అంటువ్యాధులు దరికి రావు

59చూసినవారు
తంబళ్లపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతో అంటువ్యాధులు దరికి రావు
వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధులు దరికి చేరవని కోసువారి పల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు ఆశా లత, ముని కుమార్ అన్నారు. మంగళవారం తంబళ్లపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రదర్శనలు ద్వారా అవగాహన కల్పించారు. పాఠశాల పరిసరాలు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓ శ్రీమతి, హెచ్ఏ కృష్ణ నాయక్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్