చింతపర్తికి చెందిన వెంకటేష్ (35) శుక్రవారం తంబళ్లపల్లి మండలంలోని కోటకొండకు వెళ్ళాడు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి మోటారు బైకు పై వస్తుండగా మార్గమధ్యంలోని కోటకొండ-ముదివేడు సమీపంలో గుర్తు తెలియని ఆటో ఢీకొట్టి వెళ్ళిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు గమనించి మదనపల్లి సార్వజనిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.