కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో 4సార్లు కరెంటు చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మోపిన 15, 485 కోట్ల భారాన్ని వెంటనే తగ్గించాలని సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి మనోహర్ రెడ్డి శనివారం తంబళ్లపల్లి సబ్ స్టేషన్ దగ్గర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, అదాని తో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని అన్నారు.