కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటోదని టీడీపీ తంబళ్లపల్లి వాణిజ్యపు విభాగ అధ్యక్షులు పి. విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ తాను ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానన్నారు. ప్రభుత్వం స్పందించి చికిత్స అనంతరం ప్రభుత్వం తనకు రూ, 1, 60 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారన్నారు. తనకు వైద్య ఖర్చులకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.