తంబళ్లపల్లె పరసతోపు పంచాయతీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మహేష్, శివకృష్ణులు ఏకగ్రీవం అయినట్లు మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తెలిపారు. బుధవారం టిడిపి గ్రామ కమిటీ ఎన్నికల్లో భాగంగా తంబళ్లపల్లి ఉపాధ్యక్షుడుగా లోకేష్ రెడ్డి, కార్యదర్శిగా రామాంజులు, పరసతోపు పంచాయితీ ఉపాధ్యక్షుడిగా సామిరెడ్డి, కార్యదర్శిగా శ్రీనివాసులు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ పదవులు రావడానికి సహకరించిన తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్ జయచంద్ర రెడ్డికి, టిడిపి మండల అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి, టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.