తంబళ్లపల్లి మండలం కోసువారి పల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు పుష్ప, ఫలాలతో అలంకరించారు. శ్రీవారిని కల్పవృక్ష వాహనంపై పురవీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.