తంబళ్లపల్లి ని శనివారం ఉదయం ఘట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగ మంచు కమ్మేయడంతో ఊటీ, కాశ్మీరు ను తలపిస్తోందని ప్రజలు సంబరపడుతున్నారు. తెల్లటి పొగమంచు ప్రకృతి ప్రేమికులను ఆకర్షించింది. పలువురు పొగమంచు దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆనందించారు. పొగమంచు వీడక సూర్యుడు కనపడక వాహనదారులు, కూలీలు, రైతులు ఇబ్బంది పడ్డారు.