తంబళ్లపల్లి నూతన ఎస్సైగా ఉమామహేశ్వర్ రెడ్డి

50చూసినవారు
తంబళ్లపల్లి నూతన ఎస్సైగా ఉమామహేశ్వర్ రెడ్డి
తంబళ్లపల్లె నూతన ఎస్ఐగా ఉమామహేశ్వర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు నేర రహిత సమాజం కోసం పోలీస్ సిబ్బంది, స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు, మహిళా పోలీసులు సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత నూతన ఎస్ఐ మహేశ్వర్ రెడ్డితో పాటు బదిలీ ఎస్సై లోకేష్ రెడ్డి స్టేషన్ లో జరిగిన  పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్