బి. కొత్తకోట మండలంలోని గట్టులోని హైస్కూల్ మైదానంలో సోమవారం బి. కొత్తకోట ఎంపీడీవో కృష్ణవేణి ఆధ్వర్యంలో మండల స్థాయి యోగానంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా అన్ని శాఖల అధికారులు, స్థానిక ప్రజలు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి యోగాసనాలు చేశారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను యోగా శిక్షకులు వివరించారు. ఈకార్యక్రమంలో ఈపీఆర్డి వివేకానంద, పీఈటి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.