చిత్తూరు జిల్లాలో కరువు మండలాలుగా ఇవే!!

73చూసినవారు
చిత్తూరు జిల్లాలో కరువు మండలాలుగా ఇవే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల లిస్ట్ విడుదల చేసింది. 5 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది.
వాటిలో చిత్తూరు జిల్లా నుండి 16 మండలాలు ఎంపిక చేయగా వాటిలో పెనుమూరు, యాదమరి, గుడిపాల తీవ్రంగా పరిగణిస్తూ.. శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్