వేసవి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తిరుపతికి పలు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందులో తిరుపతి - మచిలీపట్నం మధ్య 14 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి - మచిలీపట్నం, ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం - తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.