పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

53చూసినవారు
పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
అవివాహితుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి రూరల్ పీఎస్ సీఐ చిన్నగోవిందు వివరాల మేరకు రూరల్ మండలం సాయినగర్ పంచాయతీకి చెందిన ఆర్. వెంకటస్వామిరెడ్డి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. వయసు పెరుగుతున్న వివాహం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లోని రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప రాడుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి యజమాని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్