రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం

73చూసినవారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు. వీరికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్