తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నగర కార్యదర్శి రవి తెలిపారు.