ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా ఆదివారం తిరుమల వెళ్లనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని ఆమె దర్శించుకోనున్నారు. శ్రీవారికి అన్నాలెజినోవా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి అన్నాలెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు.