శ్రీవారి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే టీటీడీ బోర్డు లేనందున స్పెసిఫైడ్ అథారిటీని నియమించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎంను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ టీటీడీ పాలకమండలి నియామకం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలన్నారు.