నటసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తిరుమల శ్రీవారి అఖిలాండం వద్ద ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దఎత్తున కొబ్బరికాయలు కొట్టి బాలయ్య ఆరోగ్య సౌఖ్యాలకూ, రాజకీయ విజయాలకూ ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం బాలయ్య అభిమానులతో ఒక శుభాకాంక్షల వేదికగా మారింది.