తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే తిరుమలలో గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని ఆ ప్రకటనలో తెలిపింది.