టీటీడీ అదనపు ఈవోగా డిప్యూటేషన్ పై వచ్చిన ధర్మారెడ్డి సేవలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. గతంలో తిరుమలకు డిప్యూటేషన్ పై వచ్చిన వాళ్లు ఎవరూ ధర్మారెడ్డి పనిచేసినన్ని రోజులు లేరు. ఆయనపై పలు విమర్శలు వచ్చినా గత ప్రభుత్వం ఈవోగా నియమించింది. వైసీపీ ఓటమితో ఆయనను తప్పించి ఈవో బాధ్యతలు శ్యామలరావుకు అప్పగించారు. మరోవైపు ఇవాళ ఒక్కరోజే టీటీడీలో 113మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు.