తిరుమలలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, పాలు వంటివి అందించడం టీటీడీ ఆనవాయితీ. ఈ సేవ ఎలా జరుగుతోందో, అక్కడి పరిశుభ్రత ఎలా ఉందో చూపించే వీడియోను టీటీడీ శనివారం తన X అకౌంట్‌లో షేర్ చేసింది. “స్వామివారి దర్శనానికి ముందు భక్తులకు ప్రేమగా, సంప్రదాయంగా జరిగే అన్నపూర్ణ దివ్య సేవను ఆస్వాదించండి” అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను మంత్రి లోకేశ్ కూడా షేర్ చేశారు.