తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమే అని చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కోరారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత అయినా రాజకీయాల కోసం దేవుని వాడుకునేది వదిలిపెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తిలో మంగళవారం ఆయన డిమాండ్ చేశారు.