తిరుపతి జిల్లా ప్రజలకు పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తే వారి ఇంటి బాధ్యత పూర్తిగా పోలీసులు చూసుకుంటారని తెలియజేశారు. అయితే ప్రజలు తమ మొబైల్ ఫోన్ లో ఎల్.హెచ్.ఎం.ఎస్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ యాప్ సంబంధించి ఓ లఘు చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో యాప్ ద్వారా వారు రక్షణ ఏ విధంగా కల్పిస్తారో అనే విషయాలను వెల్లడించారు.