తిరుపతిలో ఈనెల 14వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయనున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడటం లేదు. జిల్లా ప్రజలు ఈ విషయం గమనించి, జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు రాకూడదని ఆయన సూచించారు.