తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో గురువారం తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డా. షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యం అని అన్నారు.