మంగళంలో యువకుల హల్ చల్

58చూసినవారు
మంగళంలో యువకుల హల్ చల్
తిరుపతి నగరం మంగళంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులు రోడ్డుపై అడ్డుగా నిలిచి బీభత్సం సృష్టించారు. యువకులు అడ్డుగా ఉండటంతో ఓ విద్యా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో ఆ యువకులు రాళ్లతో దాడి చేసి బస్సు అద్దాలను పగలగొట్టారు. డ్రైవర్ ను చితకబాదారు. దీంతో బస్సులోని విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్