మాజీ సీఎం వైఎస్ జగన్. ఆయన బంధు ఘనంతో కలిసి తిరుమల శ్రీవారి పాలకమండలి ద్వారా కొండను దోచేశారని టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్ సి మునికృష్ణ తదితరులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో వీరు మాట్లాడుతూ శ్రీవాణి నిధుల కుంభకోణం, లడ్డు నేతిలో కల్తీ అవినీతి ఇలా ఎన్నో కొండపై దారుణాలు వైసీపీ పాలనలో జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి అంతా వైసీపీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.