ఏపీలో అక్టోబరు 12 నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి రానుంది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి వరకూ వయా బస్టాండు, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్-నందిసర్కిల్-అలిపిరి-ఎస్‌వీఆర్‌ఆర్ ఆసుపత్రి-స్విమ్స్ వరకూ మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించలేదు.