తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రికి రంగనాయక మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని బహూకరించారు.