ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం తిరుమలలో నిర్వహించారు. ఏపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా, శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద 650 కొబ్బరి కాయలు, ఆరున్నర కేజీల కర్పూరం స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బాలకృష్ణ ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు శ్రీధర్ వర్మ తెలిపారు.