ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి పాలనలో వైసీపీ నేతలపై నమోదైన కేసులు, జరుగుతున్న దౌర్జన్యాలపై చర్చించారు. అలాగే నెల్లూరు జిల్లాలో పార్టీ పునర్వైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై పెద్దిరెడ్డి పలు సూచనలు ఇచ్చారు.