తిరుమల శ్రీవారి ఆలయ పై భాగంపై విమాన రాకపోకలు నిలిపేయాలంటూ శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పైభాగంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేందుకు ధర్మకర్తల మండలిలో ఒక "త్రీ మెన్ కమిటీ"ని ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపించాలని, కేంద్ర విమానయానశాఖ మంత్రిని కలిసి "నో ఫ్లయింగ్ జోన్" ఉత్తర్వులు తీసుకునేలా చూడాలని తిరుపతిలో శనివారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు.