రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె ఆలయం నుంచి అఖిలాండం వద్దకు చేరుకున్నారు. అక్కడ టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చారు.