తిరుపతి నగరంలో శాంతిని భంగం చేస్తున్న బుల్డోజర్ సంస్కృతిని అరికట్టాలని, వేణుగోపాల్ కాలనీలో 20 రోజుల క్రితం కూల్చిన 80 ఇళ్ల ఘటనకు బాధ్యులైనవారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం యశోద నగర్‌లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.