తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానాలు వెళ్లడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా మూడు విమానాలు వెళ్లాయి. . తిరుమల ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయంపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరుచూ జరుగుతున్న ఈ ఉల్లంఘనల దృష్ట్యా, తిరుమల క్షేత్రాన్ని పూర్తిస్థాయి "నో ఫ్లై జోన్"గా ప్రకటించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.